Breaking News

గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ

Published on Fri, 06/21/2024 - 14:57

భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.

గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.

అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్​గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)