Breaking News

'ముందు 50 శాతం డాడీ ట్యాక్స్ చెల్లించండి': ట్రంప్ పోస్ట్!

Published on Tue, 01/27/2026 - 20:15

సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.

అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్‌లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలు
ఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)