Breaking News

వైట్‌హౌజ్‌లో టెక్‌ సీఈఓలకు ట్రంప్‌ విందు

Published on Fri, 09/05/2025 - 13:02

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి వైట్‌హౌజ్‌లో ప్రముఖ టెక్‌ కంపెనీ సీఈఓలతో హైప్రొఫైల్ విందును నిర్వహించారు. రోజ్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీ అధినేతల సరసన అ‍క్కడి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి సీఈఓలు సైతం పాల్గొన్నారు.

విందుకు హాజరైన భారత సంతతి సీఈవోలు

సుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ

సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈఓ

సంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ

వివేక్ రణదివే - టిబ్కో సాఫ్ట్‌వేర్‌ ఛైర్మన్

శ్యామ్ శంకర్ - పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్

ఈ విందుకు సంబంధించిన పూర్తి అజెండాను వైట్ హౌజ్‌ విడుదల చేయనప్పటికీ కింది కీలక అంశాలపై చర్చించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రత

  • సెమీకండక్టర్, చిప్ తయారీలో అమెరికా పోటీతత్వం

  • ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, హైస్కిల్డ్ వీసాలు (హెచ్1-బీ)

  • సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత

  • యూఎస్-ఇండియా టెక్ సహకారం, సరఫరా గొలుసులపై ప్రభావం

అతిథుల జాబితాలోని ప్రముఖ కంపెనీ సీఈవోలు

పేరుకంపెనీ
బిల్ గేట్స్మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
టిమ్ కుక్యాపిల్ సీఈఓ
మార్క్ జుకర్బర్గ్మెటా సీఈఓ
సెర్గీ బ్రిన్గూగుల్ సహ వ్యవస్థాపకుడు
సామ్ ఆల్ట్ మన్ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు
గ్రెగ్ బ్రోక్ మన్ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు
సఫ్రా కాట్జ్ఒరాకిల్ సీఈఓ
డేవిడ్ లింప్బ్లూ ఆరిజిన్ సీఈఓ
అలెగ్జాండర్ వాంగ్స్కేల్ ఏఐ సీఈఓ
జారెడ్ ఐజాక్ మన్షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ

 

ఎలాన్ మస్క్ గైర్హాజరు

టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విందుకు గైర్హాజరయ్యారు. ఒకప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక కొద్దికాలంపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్‌) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్‌తో మస్క్‌ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల అమెరికా దిగ్గజ కంపెనీలకు ట్రంప్‌ దేశీయంగా పెట్టుబడులు పెంచాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కాకుండా యూఎస్‌ చేసే పెట్టుబడులు, మూలధన వ్యయాలు పెంచాలని సూచించారు. అందుకు ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకునే కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గి యూఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా కంపెనీల సీఈఓలకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్‌ ఆకర్షణీయ మార్గం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)