Breaking News

గూగుల్ మార్చేసింది.. యాపిల్‌కు ట్రంప్ ఆదేశం!

Published on Tue, 09/01/2026 - 07:47

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేరు మార్పునకు సంబంధించిన వార్తల్లో నిలిచారు. యూఎస్, కెనడా మధ్య ఉన్న లేక్ ఒంటారియో పేరును మ్యాప్స్‌లో 'లేక్ అమెరికా'గా మార్చాలని ట్రంప్ యాపిల్‌ను కోరినట్లు ఆయన ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల అధిపతి డగ్ బర్గుమ్ ఫాక్స్ తెలిపారు.

లేక్ అమెరికా
మార్నింగ్స్ విత్ మరియా కార్యక్రమంలో డగ్ బర్గుమ్ ఫాక్స్ మాట్లాడుతూ, ట్రంప్ నేరుగా యాపిల్‌ను సంప్రదించారని, త్వరలోనే వారి ప్లాట్‌ఫామ్‌లో లేక్ అమెరికా పేరు కనిపిస్తుందని నమ్మకం తనకు ఉందని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై.. యాపిల్ స్పందించలేదు.

ప్రస్తుతం యాపిల్ మ్యాప్స్‌లో లేక్ ఒంటారియా పేరు కనిపిస్తోంది. కానీ గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే అమెరికాలోని యూజర్లకు ఈ సరస్సును లేక్ అమెరికాగా చూపించడం ప్రారంభించింది. కెనడాలో ఉన్నవారికి లేక్ ఒంటారియోగా చూపిస్తోంది. దేశాలను బట్టి వేర్వేరు పేర్లు ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తాము పాటిస్తున్నామని గూగుల్ తెలిపింది.

ట్రంప్ చర్యపై విమర్శ
డొనాల్డ్ ట్రంప్ లేక్ ఒంటారియో పేరును యూఎస్ జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో మార్చాలని ఆదేశించారు. దీనిపై కెనడా తన వ్యతిరేకతను చూపింది. న్యూయార్క్‌లోని సెనెకా నేషన్ నాయకుడు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, పేరు మార్పు అనేది ఒంటారియో సరస్సుకు ఆ పేరును ఇచ్చిన ఆదిమవాసుల పట్ల గౌరవం చూపించకపోవడం అని అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ట్రంప్ తన దేశంలో లేక్ ఒంటారియో పేరును మార్చాలని ఆదేశించవచ్చు. కానీ కెనడాలో కూడా పేరును మార్చాలని ఆదేశించలేరు. అమెరికా, కెనడా మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల సమయంలో పేరు మార్పు వ్యవహారం వెలుగులోకి రావడం మరింత చర్చకు దారితీసింది.

నిజానికి డొనాల్డ్ ట్రంప్ పేర్లను మార్చడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని యాపిల్, గూగుల్ సంస్థలను ఆదేశించారు. ఇప్పుడు లేక్ ఒంటారియో పేరు మార్చడానికి సిద్ధమయ్యారు.

 ఇదీ చదవండి: CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)