యూఎస్‌ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?

Published on Tue, 03/18/2025 - 14:24

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన హయాంలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఆటోపెన్‌ను ఉపయోగించారని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొత్త పాలనా వ్యవస్థలో బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షల్లో కొన్ని చెల్లవని ట్రంప్‌ ప్రకటించారు. కొన్ని క్షమాభిక్షలను అధ్యక్షుడి ఆమోదం లేకుండానే సిబ్బంది ఆటోపెన్‌ను ఉపయోగించి ఆమోదించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

‘రాజకీయ దుండగులుగా పేరున్న కొంతమందికి జో బైడెన్ ఇచ్చినట్లు చెబుతున్న క్షమాభిక్ష చెల్లదు. ఆయన సదరు పత్రాలపై సంతకం చేయలదు. అందుకోసం కొందరు సిబ్బంది ఆటోపెన్‌ను ఉపయోగించారు. దాంతోనే బైడెన్‌ సంతకం చేసినట్లు చూపుతున్నారనే అనుమానాలున్నాయి. జో బైడెన్‌కు ఆ విషయాల గురించి తెలియకపోవచ్చు. క్షమాభిక్షకు అవసరమైన పత్రాలను బైడెన్‌కు సిబ్బంది వివరించలేదు. క్షమాభిక్ష అర్హుల గురించి, ఈ సంఘటనకు కారణమైన వ్యక్తుల గురించి బైడెన్‌కు ఏమీ తెలియదు’ అని ట్రంప్‌ తెలిపారు. బైడెన్ ఆటోపెన్‌ను ఉపయోగించినట్లు ట్రంప్ ఎలాంటి ఆధారాలు ఇవ్వనప్పటికీ తన పదవీకాలంలో ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్‌బీసీ నివేదిక ధ్రువీకరించింది.

ఆటోపెన్ అంటే ఏమిటి?

ఆటోపెన్ అనేది ఆటోమేటిక్ లేదా రిమోట్ సంతకాలు చేయడానికి ఉపయోగించే పరికరం. సాధారణ ఇ-సిగ్నేచర్ మాదిరిగా కాకుండా, ఆటోపెన్ అనేది రోబోట్ ఆధారిత రియల్‌టైమ్‌ సంతకాలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ఏదైనా వ్యక్తి పెన్ స్ట్రోక్లను ఎలా అనుకరించాలో నేర్చుకుని దానికి తగినట్లుగా తిరిగి అచ్చం అలాగే అమలు చేస్తుంది.

ఇదీ చదవండి: పెరుగుతున్న చేపల ధరలు

ఆటోపెన్ సంతకాలు చెల్లుబాటు అవుతాయా?

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నియమించిన న్యాయ శాఖలోని లీగల్ కౌన్సెల్ కార్యాలయం 2005 మార్గదర్శకాల ప్రకారం, చట్టబద్ధంగా ఆటోపెన్ ఉపయోగించే పద్ధతి ఉంది. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్‌ ఆమోదించి సంతకం చేయాలని నిర్ణయించిన బిల్లుపై భౌతికంగా తాను సిగ్నేచర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆటోపెన్‌ను ఉపయోగించవచ్చని న్యాయశాఖ తెలిపింది. ఆటోపెన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోనని ట్రంప్ తొలుత పేర్కొన్నప్పటికీ, తన గత టర్మ్‌లో అటువంటి ఉత్తర్వులపై సంతకం చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)