Breaking News

విమానయాన ప్రాప్తిరస్తు! ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది ఎక్కుతున్నారంటే..

Published on Sat, 09/09/2023 - 12:45

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్‌ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్‌–ఆగస్ట్‌ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్‌–ఆగస్ట్‌లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు.

భారత్‌ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలలో 2023 ఏప్రిల్‌ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)