Breaking News

క్విక్‌ డాక్టర్‌!

Published on Wed, 11/11/2026 - 05:10

నిత్యావసర సరుకుల నుంచి, ఫాస్ట్‌ఫుడ్‌ మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్రక్టానిక్‌ గాడ్జెట్ల వరకు అన్నీ నిమిషాల్లో డెలివరీ అవుతున్న రోజుల్లో వైద్యుడి సర్వీసులు ఎందుకు అందించకూడదు అనే ఆలోచనతో గంటలో ఇంటికే డాక్టర్‌ను పంపించే సేవలు నగరాల్లో  ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు, ఆసుపత్రుల్లో గంటల తరబడి నిరీక్షణ, బిజీ జీవనశైలి కారణంగా మెట్రో నగరాల్లో హోమ్‌ డాక్టర్‌ సేవలకు ఆదరణ పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ బట్టి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు ఈ సర్వీసులు విస్తరించే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.

క్లినిక్‌కు రోగి వెళ్లే రోజులు తగ్గి డాక్టరే రోగి ఇంటికి వచ్చే రోజులు పెరుగుతున్నాయి. క్విక్‌ కామర్స్‌ తర్వాత ఆరోగ్య రంగంలోనూ క్విక్‌ సర్వీస్‌ మోడల్‌ దూసుకొస్తోంది. ఇప్పటివరకు డాక్టర్‌ను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆసుపత్రి లేదా క్లినిక్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఫోన్‌లో లేదా యాప్‌లో రిక్వెస్ట్‌ చేస్తే సమీపంలోని వైద్యుడిని ఇంటికే పంపించే మోడల్‌ అందుబాటులోకి వచ్చింది. 

ముందస్తు అపాయింట్‌మెంట్ల కంటే అప్పటికప్పుడు డాక్టర్‌ కావాలనే రిక్వెస్ట్‌లే ఈ సేవలకు ప్రధాన డిమాండ్‌గా ఉంటున్నాయి.  డాక్టర్‌ మోర్‌పెన్‌ హోమ్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 150 మందికి పైగా వైద్యులతో ఈ క్విక్‌ డాక్టర్‌ సేవలు అందిస్తోంది. రిక్వెస్ట్‌ వచ్చిన ఐదు నిమిషాల్లోనే వైద్యుడిని కేటాయిస్తున్నామని, సాధారణంగా 60 నిమిషాల్లోపు ఇంటికి చేరుకుంటారని సంస్థ తెలిపింది. ఏడాదిన్నరలో దాదాపు 10,000 మంది రోగులకు సేవలు అందించగా నెలకు సుమారు 500 మంది కొత్త రోగులు యాప్‌లో రిజిస్టర్‌ అవుతున్నారని తెలిపింది.  

నిమిషాల్లో అంబులెన్స్‌ 
క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ కూడా అత్యవసర వైద్య సేవల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 9 నిమిషాల్లో అంబులెన్స్‌ సేవ అందిస్తోంది. 2025లో 5 అంబులెన్స్‌లతో ప్రారంభమై  ఇప్పుడు 49కి పెరిగింది. అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ అవసరానికి కావాల్సిన మందులతోపాటు ప్రా«థమిక ఆరోగ్య లక్షణాలు పరీక్షించే పరికరాలు, ఆక్సిజన్‌ సిలిండర్, స్ట్రెచర్, డీఫిబ్రిలేటర్‌తో పాటు శిక్షణ పొందిన పారామెడిక్స్, డ్యూటీ అసిస్టెంట్లు కూడా ఉంటారు.

సాధారణ జ్వరంతో మొదలై అత్యవసర సేవలదాకా..
కైనో హెల్త్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులో మాత్రమే డాక్టర్ల హోమ్‌ విజిట్స్‌ సర్వీసులు అందిస్తోంది. 2023 జనవరిలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 50000కు పైగా కన్సల్టేషన్లు పూర్తి చేసినట్లు తెలిపింది. జ్వరం, జీర్ణ సమస్యలు, రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు, జంతువుల కాట్లు వంటి సమస్యలతో ఎక్కువ మంది వైద్యులను ఇంటికి పిలిపించుకుంటున్నారని సంస్థ పేర్కొంది.  ప్రతి ప్రాంతానికి ఒక నిర్దిష్ట వైద్యుల బృందాన్ని కేటాయించడం వల్ల 60 నిమిషాల్లోపే వైద్యుడిని పంపగలుగుతున్నామని సంస్థ వివరించింది. అయితే ఈ మోడల్‌ ప్రస్తుతం ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే అందుబాటులో ఉంది.

సేవను బట్టి ధర 
సాధారణ జనరల్‌ ఫిజిషియన్‌ హోమ్‌ విజిట్‌కు సాధారణంగా రూ.500 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని సంస్థలు రూ.499 నుంచి డాక్టర్‌ హోమ్‌ విజిట్‌ సేవలు అందిస్తున్నాయి. స్పెషలిస్ట్‌ కన్సల్టేషన్లకు అయితే రూ.1,800 నుంచి రూ.5,000 వరకు చార్జీలు ఉంటున్నాయి.  క్విక్‌ డాక్టర్‌ సర్వీసుల్లోకి అపోలో, మెదాంతా, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ వంటి ప్రముఖ ఆసుపత్రులు కూడా విస్తరిస్తున్నాయి. డాక్టర్‌ విజిట్‌తో పాటు నర్సింగ్, డయాగ్నస్టిక్స్, ఇంటికే మందుల సరఫరా వంటి ప్రత్యేక సర్వీసులు అదనంగా అందిస్తున్నాయి. అయితే గంటలోపే వైద్యుడు వస్తారనే హామీ మాత్రం వీరి అన్ని సేవల్లో ఉండదు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)