Breaking News

దేశంలో రిచెస్ట్‌ గాయని ఎవరో తెలుసా?ఏఆర్‌ రెహమాన్‌తో పోలిస్తే?

Published on Tue, 07/11/2023 - 11:57

భారతీయ సినీ పరిశ్రమలో సినీ  నేపథ్య గాయకులకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. ప్లేబ్లాక్‌  సింగింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్న మహిళలు  కూడా చాలామందే  ఉన్నారు. తెలుగులో సుశీల, జానకి మొదలు వాణీ జయరాం, సునీత, చిన్మయి, ఉష లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే  లతామంగేష్కర్‌, ఆశా భోంశ్లే బాలీవుడ్‌ సినిమాను ఏలారు. ఇంకా సునిధి చౌహాన్ , శ్రేయా ఘోషల్, నేహా కక్కర్‌ లాంటి వాళ్లు లెజెండ్స్‌గా   ఈ తరాన్ని  ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  ఇండియాలో రిచెస్ట్‌ గాయని ఎవరో చూద్దాం.

భారతీయ సంగీతంలో ప్లేబ్యాక్ సింగింగ్‌కు సంబంధించి1950-60లలో గాయకులకు పైసా కూడా చెల్లించేవారు కాదట. కానీ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వాళ్లు పోరాటం ఫలితంగా ఈ తరం  గాయకులు మంచి రెమ్యునరేషన్‌ను అందుకోవడం విశేషమే మరి. ఎంతగా అంటే నేడు చాలా మంది గాయకులు కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు  లక్షల్లో వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు అనగానే పలు భాషల్లో తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్‌, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు గుర్తు వస్తారు కదా! (ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

ఈ పేర్లు టాప్ 5లో ఉన్నప్పటికీ, నికర విలువ పరంగా చూస్తే మాత్రం 37 ఏళ్ల  తులసీ కుమార్  టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఈమె నికర విలువ రూ. 200 కోట్లు.  అయితే పాటలు పాడటంతోపాటు, కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపాదన కూడా ఈమె నెట్‌వర్త్‌కు  జత కలిసింది. కంటే కొంత తక్కువగానే ఉన్నాయి. గాయకుడు-అలా సింగర్‌=ఆంట్రప్రెన్యూర్ నికర విలువ 25 మిలియన్లు డాలర్లు. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరి తులసికి  కుటుంబ వ్యాపారంలో వాటా ఉంది. సుమారు 4000 కోట్ల కంపెనీలో ఆ వాటా ఆమెకు అపారమైన సంపదను జోడిస్తోంది. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్‌ నుంచి వెనక్కి)

దాదాపు రూ.180-185 కోట్ల నికర విలువతో  శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, 100 కోట్ల రూపాయలతో తరువాతి ప్లేస్‌లో ఉన్నారు. ఇక సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర విలువ రూ. 80 కోట్లకు పైగా ఉండగా,  లేటెస్ట్‌ సెన్నేషనల్‌  సింగర్‌  నేహా కక్కర్ విలువ దాదాపు రూ. 40 కోట్లు. అయితే ఇండియా అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే తులసి నికర విలువ తక్కువే. ఆస్కార్‌ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయుడు ఏఆర్‌ రెహమాన్  నికర విలువ రూ. 500 కోట్లకు పైగా మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్లకంటే చాలా ఎక్కువ. 

తులసి మరిన్ని విషయాలు
1986 మార్చి 15న న్యూఢిల్లీలో జన్మించారు తులసి సోదరుడు భూషణ్ కుమార్,  ఖుషాలి కుమార్ అనే సోదరి ఉన్నారు. లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాలలో చదువుకుంది. వ్యాపారవేత్త హితేష్ రాల్హాన్‌తో  2015లో ప్రేమ వివాహం. వీరిద్దరికీ 2017లో  శివాయ్ రాల్హాన్ అనే పాప పుట్టింది. 

2009లో 'లవ్ హో జే' ఆల్బమ్‌తో  అరంగేట్రం   చేసిన అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బంలతో మిలియన్ల వ్యూస్‌తో ఆదరణ పొందడమే కాదు తన గాన ప్రతిభకు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 

2010- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు
2014- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్
2017- ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ
2017- మిర్చి మ్యూజిక్ అవార్డు
2019- IIFA బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌కి నామినేట్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)