Breaking News

అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?

Published on Sat, 04/05/2025 - 11:46

వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి. ఇంట్లో కరెంటు బిల్లులు భారీగానే వస్తుంటాయి. ఉక్కపోత తాలలేక ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దాంతో విద్యుత్తు బిల్లులు పెరుగుతాయి. సామాన్యులకైతే ఈ బిల్లులు రూ.వందల్లోనో లేదా మహాఅయితే రూ.వేలల్లోనో ఉంటాయి కదా. ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.70 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అయితే దానికి ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు ఉంది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీది. ముంబయిలోని తన నివాసం ‘అంటిలియా’ ఇటీవల నెల కరెంట్‌ బిల్లు ఏకంగా రూ.70,69,488గా ఉందని కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ నెల బిల్లుతో ఒక కుటుంబం జీవితాంతం ఓ మోస్తారుగా జీవనంగా సాగించవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సకాలంలో బిల్లు చెల్లిస్తుండడంతో అంబానీకి రూ.48,354 డిస్కౌంట్‌ కూడా లభించిందని రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: గిగ్‌ వర్క్‌ర్ల సంక్షేమానికి సెస్‌

అంటిలియా ప్రత్యేకతలు..

  • ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో 27 అంతస్తులతో ఈ అంటిలియాను నిర్మించారు.

  • ఈ భవనం సుమారు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

  • 50 సీట్ల థియేటర్, బహుళ స్విమ్మింగ్ పూల్స్, ఒక స్పా, ఆలయం, మరియు కృత్రిమ మంచుకొండల నుంచి మంచు కురిసేలా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

  • ఇందులో 168 కార్లు నిలిపే గ్యారేజీ ఉంది.

  • మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి.

  • అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీన్ని రూపొందించింది.

  • 2006-2010 మధ్య నిర్మించిన ఈ భవనానికి ఆ సమయంలోనే సుమారు 2 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.15,000 కోట్లు) వ్యయం అయిందని అంచనా.

  • రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)