Breaking News

ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్‌!

Published on Wed, 06/18/2025 - 18:22

దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్‌లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్‌లో 116 ఎకరాల సువిశాల టౌన్‌షిప్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్‌ను తెలియజేస్తోంది.

గురుగ్రామ్‌లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్‌మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్‌లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.

👉ఇది చదివారా? హైదరాబాద్‌లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌

డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్‌లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్‌ చేసిన ప్రివానా సౌత్‌, ప్రివానా వెస్ట్‌ ప్రాజెక్ట్‌లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి.  హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.

ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల  విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)