దీపావళి వేళ స్టాక్ మార్కెట్ల సందడి.. ట్రేడింగ్ టైమింగ్స్ ఇవే!

Published on Sun, 11/08/2026 - 09:09

దీపావళి పండుగ సందర్భంగా, ఆదివారం అయినా.. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్‌కు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాది దీపావళి రోజున నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌ను ఈరోజు (నవంబర్ 8) NSE, BSE ఎక్స్ఛేంజీలు నిర్వహించనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది విక్రమ సంవత్ 2083 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక సెషన్ జరగనుంది.

సాధారణంగా దీపావళి రోజున మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ.. ముహూరత్ ట్రేడింగ్ కోసం మాత్రం కొద్దిసేపు ప్రత్యేకంగా మార్కెట్లను తెరుస్తారు. ఈ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే కొత్త ఏడాది శుభప్రదంగా ప్రారంభమవుతుందని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతారు.

ముహూరత్ ట్రేడింగ్ సమయం
➤ఈరోజు మధ్యాహ్నం 2:20 గంటలకు ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభమై 3:30 గంటలకు ముగుస్తుంది. 
➤2:05 నుంచి 2:15 గంటల వరకు ప్రీ-ఓపెన్ సెషన్ ఉంటుంది.
➤2:15 నుంచి 2:17 గంటల మధ్య ఆర్డర్ల మ్యాచింగ్ జరుగుతుంది.
➤ఇక బ్లాక్ డీల్ సెషన్ మధ్యాహ్నం 1:50 నుంచి 2:05 గంటల వరకు నిర్వహిస్తారు.
➤IPOలు, తిరిగి లిస్ట్ అయిన షేర్ల కోసం ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ కూడా ఉంటుంది.
➤ఇలిక్విడ్ షేర్ల కోసం 2:25 నుంచి 3:10 గంటల వరకు కాల్ ఆక్షన్ సెషన్ నిర్వహించనున్నారు.

ప్రధాన ట్రేడింగ్ ముగిసిన తర్వాత కూడా.. కొన్ని ప్రక్రియలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 3:15 నుంచి 3:20 గంటల మధ్య రిఫరెన్స్ ధరలను లెక్కిస్తారు. 3:20 నుంచి 3:30 గంటల వరకు సీఏఎస్ ఆర్డర్లకు అవకాశం ఉంటుంది. 3:35 గంటలకు ట్రేడ్ మ్యాచింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత 3:50 నుంచి 4 గంటల వరకు పోస్ట్ క్లోజ్ సెషన్ నిర్వహిస్తారు. ట్రేడ్లలో మార్పులు చేసుకోవడానికి చివరి సమయం సాయంత్రం 4:15 గంటలుగా నిర్ణయించారు.

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
నిజానికి ముహూరత్ ట్రేడింగ్ అనేది భారత స్టాక్ మార్కెట్లలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. దీపావళి రోజున కొత్త వ్యాపార సంవత్సరం ప్రారంభమవుతుందని భావించి, పెట్టుబడిదారులు ఈ సమయంలో కనీసం ఒక షేరైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. ఈ ట్రేడింగ్‌లో చేసే పెట్టుబడులు కూడా సాధారణ మార్కెట్ పెట్టుబడుల్లాగే రిస్క్‌తో కూడుకున్నవే.

విక్రమ సంవత్ 2082లో దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. చివరి వారంలో కొంత కోలుకున్నప్పటికీ ఏడాది మొత్తంగా నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ సుమారు 4 శాతం పడిపోగా, సెన్సెక్స్ దాదాపు 5 శాతం నష్టపోయింది. అయితే.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, బ్యాంకింగ్ షేర్లు మాత్రం మంచి రాబడులను అందించాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా షేర్లు 24 శాతం, మెటల్ షేర్లు 23 శాతం లాభపడ్డాయి. మరోవైపు FMCG షేర్లు 18 శాతం, ఐటీ షేర్లు 7 శాతం నష్టపోయాయి.

ఇదీ చదవండి: జీతం రూ.2 లక్షలు, ఇన్‌స్టా ద్వారా రూ.2 లక్షలు.. నేను జాబ్ మానేయొచ్చా?

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)