Breaking News

స్టాక్‌ మార్కెట్‌ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్‌ ఉంటుందా?

Published on Fri, 10/17/2025 - 19:35

దేశీయ స్టాక్‌మార్కెట​్‌కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్‌ ట్రేడింగ్‌ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.

అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.

2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు 
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..

అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ 
అక్టోబరు 22 - బలిప్రతిపాద 
నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ 
డిసెంబర్ 25 - క్రిస్మస్

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)