Breaking News

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఇకపై ఫ్రీగా చూసేయండి!

Published on Sat, 06/10/2023 - 11:29

భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్‌ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందనే చెప్పాలి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ రిచ్‌ లీగ్‌ను ప్రసార హక్కులు కోసం ఎగబడుతుంటాయి. ఈ ఏడాది ఐపీఎల్‌2023 స్ట్రీమింగ్‌ రైట్స్‌ను జియో సినిమా సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించడం, దాంతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల కారణంగా జియో సినిమా రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌ ( వీక్షకులు) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీ+ హాట్‌స్టార్ తమ మొబైల్ వినియోగదారులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.


బంఫర్‌ ఆఫర్‌

ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ సంస్థలు హిట్‌ ఫార్ములాను అనుసరిస్తూ పోతుంటాయి. ఇటీవల ఐపీఎల్-2023 సీజన్‌ను రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమాలో ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో డిస్నీ హాట్‌స్టార్‌ కూడా నడవనుంది.  ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను మొబైల్‌ ఫోన్‌లలో ఉచితంగా స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తమ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.


ఇటీవల హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న జియో..కేవలం యాప్‌ డౌన్‌లోడ్‌  చేసుకుంటే చాలు, రుసుము చెల్లించకుండా ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను వీక్షించవచ్చని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా రికార్డు స్థాయిలో డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)