Breaking News

డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు షాక్‌! నవంబర్ 1 నుంచే..

Published on Sun, 10/01/2023 - 21:22

నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను పరిమితం​ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్‌డేట్‌లను కెనడాలోని సబ్‌స్క్రైబర్‌లకు ఈ-మెయిల్‌ చేసింది.  

ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్‌ సెంటర్‌ను కూడా అప్‌డేట్‌ చేసింది. 

యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్‌వర్డ్‌ షేర్‌ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్‌ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్‌స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. 

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ భావిస్తోంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)