డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్‌! మార్గదర్శకాలు విడుదల

Published on Fri, 08/11/2023 - 21:47

వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్‌లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయన్సర్‌లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్‌, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్‌/ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్‌లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీటికి మినహాయింపు
అయితే  వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్‌నెస్‌, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)