Breaking News

ఐదేళ్లలో వజ్రాల డిమాండ్‌ రెట్టింపు 

Published on Sat, 05/24/2025 - 05:48

ముంబై: భారత్‌లో వజ్రాల వినియోగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్టు డీబీర్స్‌ గ్రూప్‌ (డైమండ్‌ కంపెనీ) సీఈవో అల్‌కుక్‌ తెలిపారు. భారత్‌లో ఫరెవర్‌మార్క్‌ బ్రాండ్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ వ్రజాభరణాలకు భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద మారెŠక్‌ట్‌గా ఉన్నట్టు తెలిపారు. గతేడాది చైనాను అధిగమించినట్టు చెప్పారు. ఏటా 12 శాతం చొప్పున డిమాండ్‌ పెరుగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌తో సహజ వజ్రభరణాల డిమాండ్‌ 10 బిలియన్‌ డాలర్లలోపు ఉన్నట్టు చెప్పారు.

 భవిష్యత్‌ వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ముంబైలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫరెవర్‌మార్క్‌ స్టోర్లను తెరవనున్నట్టు.. వచ్చే ఐదేళ్లలో 100 స్టోర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. కంపెనీ సొంత స్టోర్లతోపాటు, ఫ్రాంచైజీ రూపంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల పరిధిలో ఇవి ఉంటాయన్నారు. ఫరెవర్‌మార్క్‌ బ్రాండ్‌కు ఓమ్నిఛానల్‌ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) విధానం అనుసరిస్తామని డీబీర్స్‌ ఇండియా ఎండీ అమిత్‌ ప్రతిహారి తెలిపారు. ‘‘ఈ కామర్స్‌తోపాటు స్టోర్లను కూడా తెరుస్తున్నాం. భౌతిక స్టోర్ల అందుబాటు కూడా కీలకమే’’అని చెప్పారు.  

ఎల్‌జీడీలకు భవిష్యత్‌ 
ల్యాబ్‌ గ్రోన్‌ వజ్రాలకు (ఎల్‌జీడీ) వాణిజ్య పరంగా భవిష్యత్‌ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కుక్‌ చెప్పారు. ఎల్‌జీడీల టోకు ధరలు 90 శాతం వరకు పడిపోయినట్టు తెలిపారు. ‘‘సహజ వజ్రాలు–ఎల్‌జీడీలకు మధ్య వ్యత్యాసంపై వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తాం. దీంతో ఈ రెండింటి మధ్య తేడా చెప్పలేరన్న అపోహ తొలగిపోతుంది. వజ్రం ధ్రువీకరణ ప్రభావం ఇక మీదట పెరిగేదే’’అని వివరించారు. భారత్‌లో సహజ వజ్రాలకున్న డిమాండ్‌ నేపథ్యంలో మార్కెటింగ్‌పై ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు కుక్‌ తెలిపారు. సజహ వజ్రాలను టారిఫ్‌ పరిధి నుంచి అమెరికా మినహాయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో సహజ వజ్రాల గనులు లేకపోవడంతో అక్కడ ఉత్పత్తికి అవకాశం లేదన్నారు.   
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)