Breaking News

రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష

Published on Wed, 11/06/2024 - 18:04

వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్‌, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.

రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.

ఇదీ చదవండి: ట్రంప్‌-బైడెన్‌.. ఎవరి హయాంలో భారత్‌ వృద్ధి ఎంత?

రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టి

చేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)