Breaking News

మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

Published on Fri, 10/17/2025 - 08:34

ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్‌లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.

షేరుకి రూ.23 డివిడెండ్‌

వాటాదారులకు ఇన్ఫోసిస్‌ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్‌ కాగా నవంబర్‌ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్‌ సంగ్రాజ్‌కా తెలిపారు.

ఇతర విశేషాలు

  • క్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్‌ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.

  • ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.

  • ఈ కాలంలో 3.1 బిలియన్‌ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది.  

  • ఆదాయంలో ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.

  • తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్‌ బిజినెస్‌ 8.3 శాతం, కమ్యూనికేషన్స్‌ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి.  

  • రిటైల్‌ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్‌ సైన్సెస్‌ 9 శాతం క్షీణించింది.

  • ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.

  • యూరప్‌ బిజినెస్‌ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్‌ వాటా 2.9 శాతమే.

ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)