Breaking News

భార్య పేరు మీద డిపాజిట్‌.. రూ.32వేలు వడ్డీ

Published on Mon, 01/20/2025 - 21:38

దేశంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఇదే క్రమంలో మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate-MSSC) స్కీమ్‌. కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రారంభించింది.

కనీసం రూ.1000.. గరిష్టంగా రూ. 2 లక్షలు
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద కనీసం రూ. 1000.. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 2 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే, మీరు ఖాతా తెరిచిన తేదీ నుండి సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద, మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో మీ భార్య పేరు మీద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవవచ్చు.

రూ.32,000 వడ్డీ
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. ఒక వేళ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఈ మొత్తంపై మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీపై మొత్తం రూ. 2,32,044.00 పొందుతారు. అంటే రూ.2 లక్షల డిపాజిట్ పై  రూ.32,044 వడ్డీని పొందుతారు.

కుమార్తె లేదా తల్లి పేరుతోనూ ఖాతా
మీకు ఇంకా వివాహం కాకపోతే, మీరు మీ తల్లి పేరు మీద కూడా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, మీకు కుమార్తె ఉంటే, మీరు ఆమె పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)