Breaking News

మాల్స్‌లో తగ్గిన రిటైల్‌ లీజింగ్‌ 

Published on Fri, 01/31/2025 - 06:29

న్యూఢిల్లీ: షాపింగ్‌ మాల్స్, హై స్ట్రీట్‌లలో (ప్రముఖ షాపింగ్‌ ప్రాంతాలు) రిటైల్‌ స్థలాల లీజింగ్‌ 2024లో 10 శాతం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 64 లక్షల చదరపు అడుగుల లీజింగ్‌ కార్యకలాపాలు 2024లో నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై మాత్రం రాణించాయి. ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో స్థూల రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ 71 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. 

‘‘భార త రిటైల్‌ స్పేస్‌ విభాగం 2025లో గణీయమైన వృద్ధిని చూడనుంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరులో 50–60 లక్షల చదరపు అడుగుల గ్రేడ్‌–ఏ మాల్స్‌ స్థలాలు ఈ ఏడాది వినియోగంలోకి రానున్నాయి’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీ ఈవో అన్హుమన్‌ మ్యాగజిన్‌ తెలిపారు. మధ్య శ్రేణి ఫ్యాషన్, వ్యాల్యూ ఫ్యాషన్, క్రీడా వ్రస్తాలు, జ్యుయ లరీ విభాగాల నుంచి బలమైన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సైతం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. రిటైల్‌ కేంద్రాలు షాపింగ్, డైనింగ్, వినోదం కలిసిన వినూత్నమైన అనుభవాన్ని అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. 

పట్టణాల వారీగా లీజింగ్‌ 
→ హైదరాబాద్‌ మార్కెట్లో 2024లో రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ డిమాండ్‌ 10 లక్షల చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది 7 లక్షల చదరపు అడుగులుగానే ఉంది.  
→ చెన్నైలోనూ రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ 6 లక్షల ఎస్‌ఎఫ్‌టీ నుంచి 7 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 2023లో 14 లక్షల చదరపు అడుగుల లీజింగ్‌ నమోదు కాగా, 2024లో 10 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.  
→ బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 19 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి. 
→ ముంబైలో 10 లక్షల ఎస్‌ఎఫ్‌టీ నుంచి 8 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి లీజింగ్‌ తగ్గింది. 
→ పుణెలోనూ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 6 లక్షలకు పరిమితమైంది.  
→ కోల్‌కతాలో రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ లక్ష చదరపు అడుగుల నుంచి 2 లక్షలకు పెరిగింది. 
→ అహ్మదాబాద్‌లో 5 లక్షల నుంచి 4 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)