Breaking News

హైదరాబాద్‌లో ఆఫీస్‌ వసతులకు డిమాండ్‌

Published on Sun, 10/12/2025 - 10:27

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్లో బలమైన డిమాండ్‌ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.9 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్‌ నమోదైంది. ఈ ఏ డాది మొదటి తొమ్మిది నెలల్లో లీజింగ్‌ 8.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్‌-8 పట్టణాల్లో సెపె్టంబర్‌ క్వార్టర్‌లో ఆఫీస్‌ లీజింగ్‌ క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే 6% తగ్గి 17.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ నగరాల్లో స్థూల లీజింగ్‌ మాత్రం 24 శాతం పెరిగి 66.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరిందని, పూర్తి ఏడాదికి రికా ర్డు స్థాయిలో 85 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌ నమోదు కావొచ్చని అంచనా వేసింది.  
పట్టణాల వారీగా..

  • బెంగళూరులో ఆఫీస్‌ లీజింగ్‌ సెప్టెంబర్ క్వార్టర్‌లో 21 శాతం క్షీణించి 4.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
  • చెన్నై మార్కెట్లో ఆఫీసు వసతుల లీజింగ్‌ 9% పెరిగి 2.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో మాత్రం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం తగ్గి 2.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
  • పుణెలో 9 శాతం తగ్గి 2.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి ఆఫీస్‌ లీజింగ్‌ పరిమితమైంది.
  • ముంబైలో సెప్టెంబర్ క్వార్టర్‌లో లీజింగ్‌ 27 శాతం తగ్గి 1.9 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. తొమ్మిది నెలల కాలంలో చూసినా 12 శాతం తగ్గి 7.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
  • కోల్‌కతాలో ఆఫీస్‌ లీజింగ్‌ సెప్టెంబర్ క్వార్టర్‌లో 190 శాతం పెరిగి 0.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
  • అహ్మదాబాద్‌ మార్కెట్లో 13 శాతం పెరిగి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.

ఇదీ చదవండి: ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)