Breaking News

ఇల్లు కొనే ట్రెండ్‌.. కరోనాకు ముందు, తర్వాత..

Published on Sun, 04/06/2025 - 14:10

కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. నివాస కొనుగోళ్ల ట్రెండ్‌ను కరోనాకు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్‌ కంటే ముందు ఇల్లు కొనాలంటే మొదటి ప్రాధాన్యత బడ్జెట్‌ ఎంత అనే.. కానీ, కరోనా తర్వాత బడ్జెట్‌ అంటే లెక్కేలేదు. విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

మహమ్మారితో వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాసుల నేపథ్యంలో ఇంటిలో గడిపే సమయం పెరిగింది. మరోవైపు ఐసొలేషన్‌ కారణంగా విశాలమైన, ప్రత్యేక గదుల అవసరం ఏర్పడింది. దీంతో గృహ కొనుగోలుదారులు క్రమంగా విశాలమైన ఇళ్లకు మారిపోతున్నారు. అప్పటిదాకా 2 బీహెచ్‌కే వాసులు.. క్రమంగా 3 వైపు.. 3 బీహెచ్‌కే వాసులు నాలుగు పడక గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లో ఇంటి విస్తీర్ణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా డెవలపర్లు కూడా విశాలమైన ఇళ్లనే నిర్మిస్తున్నారు.      

4 బీహెచ్‌కేకు ఆదరణ.. 
స్థిరమైన ధరలు, అధిక రాబడుల కారణంగా హైదరాబాద్‌లో ప్రాపర్టీలలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలు, విలాసవంతమైన జీవనశైలి, ఆధునిక వసతులు కోరుకునేవారు ఎక్కువగా 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలలో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. సైనిక్‌పురి, యాప్రాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాల్లోని యూనిట్లకూ ఆదరణ బాగానే ఉంది. వీటి సగటు ధర రూ.1.78 కోట్ల నుంచి ఉన్నాయి.

గ్రేటర్‌లో పెరిగిన విస్తీర్ణాలు.. 
హైదరాబాద్‌లో ఏటేటా అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2014లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,830గా ఉండగా.. 2018 నాటికి 1,600లకు తగ్గాయి. నాలుగేళ్లలో ఏకంగా ఫ్లాట్ల సైజు 13 శాతం తగ్గింది. కోవిడ్‌ కాలంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. దీంతో ఇంటి అవసరం తెలిసొచ్చింది. వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌లతో ఇంట్లో ప్రత్యేక గది అనివార్యమైపోయింది. దీంతో ఇంటి విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,700 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 2,200 చ.అ.లకు పెరిగింది.

45 శాతం డిమాండ్‌.. 
కరోనా కంటే ముందు లగ్జరీ గృహాలైన 4 బీహెచ్‌కే ఫ్లాట్లకు 27 శాతం డిమాండ్‌ ఉండగా.. ఇప్పుడది ఏకంగా 45 శాతానికి పెరిగిందని అనరాక్‌–ఫిక్కీ హోమ్‌ బయ్యర్స్‌ సెంటిమెంట్‌ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు నగరాల్లో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు 32 శాతం మేర పెరిగాయి. 2019లో సగటు ఫ్లాట్‌ సైజు 1,145 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది 1,513 చ.అ.లకు పెరిగింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)