Breaking News

పశువుల వ్యాపారం చేస్తున్న ఐఐటీ అమ్మాయిలు, వందల కోట్ల టర్నోవర్‌తో..

Published on Mon, 04/10/2023 - 15:59

Neetu Yadav and Kirti Jangra: ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటూ విజయాన్ని సాధించిన వారు చాలానే ఉన్నారు. ఇందులో నీతూ యాదవ్ & కీర్తి జంగ్రా కూడా ఉన్నారు. ఢిల్లీలో ఐఐటి పూర్తి చేసి 'యానిమల్ టెక్నాలజీస్' స్థాపించి ఇప్పుడు కోట్లలో గడిస్తున్నారు. ఇంతకీ వీరి విజయ గాథ వెనుక ఉన్న అసలైన కథ ఏంటనేది ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..

ఢిల్లీలో ఐఐటీ రూమ్‌మేట్స్‌గా కలిసిన అమ్మాయిలు తమ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్‌ను ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్‌లను పొందడం ప్రారంభించారు.

(ఇదీ చదవండి: Force Citiline: ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?)

యానిమల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా.. మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది.

యానిమాల్ (Animall) అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్. దీని ద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా ఉంటుంది. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు & సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు.

(ఇదీ చదవండి: ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్)

2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)