Breaking News

పండుగ వేళ ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం, ఫైర్‌ క్రాకర్స్‌ బ్యాన్‌ 

Published on Wed, 09/07/2022 - 12:06

న్యూఢిల్లీ:  కాలుష్య భూతానికి చెక్‌ పెట్టేలా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం  తీసుకుంది. జనవరి 1, 2023 వరకు పటాకులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం (సెప్టెంబర్ 7) సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలో కాలుష్య  భూతంనుంచి ప్రజలను రక్షించడానికి, గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

తద్వారా కాలుష్య భూతంనుంచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చంటూ రాయ్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ప్రకటించారు. జనవరి 1, 2023 వరకు పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని రాయ్ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఈ ఏడాది దేశ రాజధానిలో ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం లేదా డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు.

నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పండుగ సీజన్‌లో ముఖ్యంగా దీపావళి సందర్బంగా క్రాకర్స్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది.  ఇప్పటికే ఢిల్లీలోని కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో దీని నివారణకు అనేక చర్యల్ని చేపడుతోంది. 

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది  ‘పతాఖే నహీ దియే జలావో’ అంటూ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా పటాకుల అమ్మకాలను,  పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పటాకులు పేల్చి పట్టుబడిన వారికి రూ.1,000 జరిమానా విధించగా, సైలెంట్ జోన్‌లలో అదే పని చేస్తూ పట్టుబడిన వారికి 3 వేల జరిమానా విధించారు. వివాహాలు, మతపరమైన పండుగలు లేదా ర్యాలీలు, బహిరంగ సభల్లో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే  నివాస, వాణిజ్యం ఆవాసాల్లో అయితే పదివేలు, కీలక జోన్లలో రూ. 20 వేలు  చెల్లించేలా  ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)