Breaking News

లిస్టింగ్‌కు 3 కంపెనీలు రెడీ

Published on Tue, 11/25/2025 - 05:19

న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ఈ క్యాలండర్‌ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు దూసుకెళుతున్నాయి. నిజానికి 2024లో 76 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా ఉమ్మడిగా రూ. 1.53 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మెయిన్‌బోర్డులో 93 కంపెనీలు రూ. 1.54 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో మరో మూడు కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. 

ఏఐ సొల్యూషన్స్‌ 
ఎండ్‌టు ఎండ్‌ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సొల్యూషన్లు అందించే ఫ్రాక్టల్‌ అనలిటిక్స్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 1,279 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 3,621 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 4,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 

ఐపీవోలో క్వినాగ్‌ బిడ్కో రూ. 1,463 కోట్లు, టీపీజీ హోల్డింగ్స్‌ రూ. 2,000 కోట్లు, జీఎల్‌ఎమ్‌ కుటుంబ ట్రస్ట్‌ రూ. 129 కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ కంపెనీ ఫ్రాక్టల్‌ యూఎస్‌ఏలో పెట్టుబడులు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, ఆర్‌అండ్‌డీ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది.  

సాస్‌ కంపెనీ 
సాస్‌ సర్వీసులందించే అమాగీ మీడియా ల్యాబ్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 1,020 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రస్తుత వాటాదారులు 3.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 667 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. 

కార్డియాక్‌ స్టెంట్స్‌ 
2001లో ఏర్పాటైన మెడికల్‌ పరికరాల తయారీ కంపెనీ సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు రానుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.76 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేర్లు ఆఫర్‌ చేయనున్న సంస్థలలో శ్రీ హరి ట్రస్ట్, సమారా క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్డింగ్, కొటక్‌ ప్రీఐపీవో అపార్చునిటీస్‌ ఫండ్‌ తదితరాలున్నాయి. కంపెనీ ప్రధానంగా కార్డియాక్‌ స్టెంట్స్‌ను తయారు చేస్తోంది. కంపెనీ భారత్, థాయ్‌లాండ్‌లలో రెండు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)