Breaking News

భారత్‌లో ఫాల్కన్‌ జెట్స్‌ ఉత్పత్తి

Published on Thu, 06/19/2025 - 04:30

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్‌లో ఫాల్కన్‌ 2000 బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ జెట్‌ విమానాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం డసాల్ట్‌ ఏవియేషన్‌తో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్‌ (ఆర్‌ఏఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను ఫ్రాన్స్‌ వెలుపల తయారు చేయడం ఇదే ప్రథమం. ప్యారిస్‌ ఎయిర్‌షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయం ప్రకటించాయి.

 హై ఎండ్‌ బిజినెస్‌ జెట్స్‌ తయారీకి భారత్‌ వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ‘ఫాల్కన్‌ 2000 జెట్స్‌’ కోసం అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో బిజినెస్‌ జెట్స్‌ను తయారు చేయడంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్‌ సరసన భారత్‌ కూడా చేరుతుంది. 

మేకిన్‌ ఇండియా నినాదానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని డసాల్ట్‌ ఏవియేషన్‌ చైర్మన్‌ ఎరిక్‌ ట్రాపియర్‌ తెలిపారు. రిలయన్స్‌ గ్రూప్‌ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ అనిల్‌ డి. అంబానీ పేర్కొన్నారు.  జంట ఇంజిన్లుండే ఈ విమానాల్లో 8–10 మంది వరకు ప్రయాణించవచ్చు. 2028 నాటికి తొలి మేడిన్‌ ఇండియా ఫాల్కన్‌ 2000 విమానం డెలివర్‌ కానుంది.

 డసాల్ట్‌ ఏవియేషన్‌ గత వందేళ్లలో 90 పైగా దేశాలకు 10,000 మిలిటరీ, పౌర విమానాలను సరఫరా చేసింది. 2017లో డసాల్ట్‌ ఏవియేషన్, రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్‌ (డీఆర్‌ఏఎల్‌) జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేశాయి. 2019లో ఫాల్కన్‌ 2000 ముందు భాగా న్ని ఉత్పత్తి చేసినప్పటి నుంచి 100కు పైగా కీలకమైన సబ్‌–సెక్షన్లను ఈ జేవీ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఫాల్కన్‌ జెట్స్‌ తయారీలో కీలకంగా ఎదిగింది.   

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)