Stocks Market: లాభాల ‘సిక్సర్‌’

Published on Wed, 04/23/2025 - 02:30

ముంబై: బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.

అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్‌ పావెల్‌ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్‌ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

⇒ ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్‌ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్‌ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.

⇒ బీఎస్‌ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్‌ఎంసీజీ 2%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 1.5% లాభప డ్డాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లు 1% రాణించాయి. 
⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది.  

⇒ మైక్రోఫైనాన్స్‌ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్‌ అడిట్‌ కోసం  ఎర్నెస్ట్‌–యంగ్‌ నియమించుకుందనే వార్తలతో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.
⇒ దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్‌ దాస్‌ భీంజీ ఝవేరీ(టీజీజెడ్‌) 6%, స్కై గోల్డ్‌ 5%, సెన్కో గోల్డ్‌ 3 శాతం లాభపడ్డాయి. 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)