Breaking News

హైదరాబాద్‌లో భారీ బ్యాటరీ పరిశ్రమ

Published on Wed, 04/30/2025 - 16:53

హైదరాబాద్: సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో భారీ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఈ-మొబిలిటీ వ్యాలీలో తన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) గిగాఫ్యాక్టరీ మొదటి దశను ప్రారంభించి భారతదేశ క్లీన్‌ ఎనర్జీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.

ఇది దేశంలోనే  మొదటి లీడ్‌ (LEED - లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్) అర్హత పొందిన అత్యాధునిక ఫ్యాక్టరీ. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించారు. గ్రిడ్-స్కేల్ స్టోరేజ్‌, ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 4.8 గిగావాట్-అవర్ల (GWh) బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కర్మాగారం క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యాక్టరీ రెండవ దశ ఎలా ఉండనుందో సిగ్ని ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్ రాజారామన్ వెల్లడించారు.  రెండో దశలో మరో రూ.150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 10.8 GWhకు విస్తరించనున్నట్లు చెప్పారు. 24 నెలల్లో పూర్తయ్యే ఈ విస్తరణ 1,000 పైగా  ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని వివరించారు.

ఈ గిగాఫ్యాక్టరీ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్విన్ మోడలింగ్, స్మార్ట్-గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సిగ్ని, ఐఐటీ-మద్రాస్‌తో భాగస్వామ్యం ద్వారా సోడియం-అయాన్ బ్యాటరీలు, సూపర్‌కెపాసిటర్‌ల వంటి తదుపరి తరం బ్యాటరీ పదార్థాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి శక్తి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అరుదైన పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. 1 GWh ఆర్డర్ పైప్‌లైన్‌తో, సిగ్ని ఎనర్జీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)