రత్నాభరణాల ఎగుమతులు ఎలా ఉన్నాయంటే..

Published on Wed, 05/14/2025 - 09:09

భారత రత్నాభరణాల ఎగుమతులు (జెమ్స్, జ్యుయలరీ) ఏప్రిల్‌ నెలలో కొంత నీరసించాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 4.62 శాతం తక్కువగా 2,037 మిలియన్‌ డాలర్లుగా (రూ.17,314 కోట్లు) నమోదయ్యాయి. 2024 ఏప్రిల్‌లో జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు 2,136 మిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. 

ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది. కట్, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఏప్రిల్‌ నెలతో పోల్చి చూసినప్పుడు 6% తక్కువగా 1,109 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 1,181 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు సైతం 5.41 శాతం తగ్గాయి. 684 మిలియన్‌ డాలర్ల విలువైన ఆభరణాల ఎగుమతులు జరిగాయి.

క్రితం ఏడాది ఇదే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 724 మిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్‌ పట్టిన ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ ఎగుమతులు 110.74 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు 12% క్షీణతతో 38.3 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్‌ జెమ్‌స్టోన్‌ ఎగుమతులు మాత్రం 12శాతం 27.76 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 24.8 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్‌ ఇవి..

కట్‌ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గతంలో ‘డైమండ్‌ ఇంప్రెస్ట్‌ ఆథరైజేషన్‌ స్కీమ్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశాలుగా ఉన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)