Breaking News

బంగారం భగభగ..

Published on Sat, 06/14/2025 - 04:30

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది. 

ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఆగస్ట్‌ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్‌ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్‌ కమోడిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కళంత్రి తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)