Breaking News

ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!

Published on Thu, 04/02/2026 - 11:11

ఆఫ్రికాలోని గ్రీకు ద్వీపమైన క్రీట్‌లో బుధవారం ప్రకృతి ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఇతర గ్రహంపై ఉన్నామా అన్నంతగాలా వాతావరణం మారిపోవడంతో స్థానిక నివాసితులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఏమిటీ వింత? ఎందుకు ఇలా జరిగింది?

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఇది ఎటువంటి అతీత శక్తి వల్ల కలిగింది కాదు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవించిన సహజ పరిణామం. దీనికి ప్రధాన కారణం సహారా ఎడారి నుంచి వీచిన భారీ ధూళి తుఫాను. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు, టన్నుల కొద్దీ సన్నని ఇసుక, ధూళి కణాలను మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశగా మోసుకొచ్చాయి. ఈ ధూళి మేఘాల మార్గంలో దక్షిణ ఏజియన్ సముద్ర తీరంలో క్రీట్ ద్వీపం ఉండటంతో ఇక్కడ ప్రభావం అత్యధికంగా కనిపించింది.

ఆకాశం ఎరుపు రంగులోకి ఎందుకు మారుతుంది?

‘వాతావరణంలో ధూళి కణాలు దట్టంగా ఉన్నప్పుడు అవి సూర్యరశ్మిని విడగొడుతాయి(స్కాట్టరింగ్‌). తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కణాలు చెల్లాచెదురైపోగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి చేరుతాయి. దీనినే ‘రెడ్ స్కై ఫినామినా’ అంటారు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.

పర్యావరణానికి వరప్రసాదం.. కానీ..

ఈ ధూళి తుఫాను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పర్యావరణానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి ధూళిలో ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నేలపై చేరినప్పుడు మట్టిని, సముద్రంలో పడినప్పుడు సముద్రపు నాచును సారవంతం చేస్తాయి. అయితే, గాలి నాణ్యత (ఏక్యూఐ) భారీగా పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: సెజ్‌ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు

#

Tags : 1

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)