Breaking News

క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం!

Published on Wed, 01/25/2023 - 17:59

ఇటీవల క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త పేర్లతో క్రెడిట్‌ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే రివార్డ్‌లు, తక్కువ వడ్డీలు, ఆఫర్లను అందించేవి బోలెడు ఉన్నా పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉపయోగిస్తే అవి మన జేబులకు చిల్లు పెట్టే అవకాశం కూడా ఉందండోయ్‌.

అందుకే కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్‌ కార్డు సరిపోతుందో తెలుసుకోవాలి. ఆపై వాటిని తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా క్రెడిట్‌ కార్డు అర్హత లభిస్తుంది. ఇవి తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం!

వినియోగం బట్టి కార్డు ఎంపిక ఉత్తమం
ముఖ్యంగా మీరు కార్డుని ఎలా వాడుకుంటారు అనేది క్రెడిట్‌ కార్డు ఎంపికలో కీలకం. ఉదాహరణకు కొందరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువగా చేస్తుంటారు. అలాంటప్పుడు షాపింగ్‌ వెబ్‌సైట్లు,బ్రాండ్‌లపై డిస్కౌంట్లు అందించే కార్డును ఎంచుకుంటే మంచిది. లేదా మార్కెటింగ్‌ పని చేస్తున్నవారు ద్విచక్రవాహనంపై ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున.. పెట్రోలుపై క్యాష్‌ బ్యాక్‌, అధిక రివార్డు పాయింట్లు అందించే కార్డును పరిశీలించాల్సి ఉంటుంది. 

మీ వాడకం బట్టి ఏ తరహా కార్డు కావాలో ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా
,డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌, రివార్డ్‌ వంటి ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోని అనంతరం అవగాహనతో మీ కార్డును వినియోగించడం ఉత్తమం.
►మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా బ్యాంకులు మీ క్రెడిట్‌ కార్డుకి పరిమితిని నిర్ణయిస్తాయి. పరిమితిలో 50 శాతానికి మించి ఉపయోగించకపోవడమే ఉత్తమం. లేదంటే అది క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

► కొన్ని బ్యాంకులు వాటి కార్డులపై వార్షిక రుసుములు వసూలు చేయడం లేదు. అయితే ఆ నిబంధన కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. సంవత్సరంలో కస్టమర్‌ ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ రకమైన బెనిఫిట్‌ పొందగలరు. అన్నింటికంటే ముఖ్యమైనది కార్డు బిల్లుని గడువు తేది లోపు చెల్లించాలి.

చదవండి: బడ్జెట్‌ 2023: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)