Breaking News

రోజుకు 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగికి డాక్టర్‌ సలహా..

Published on Sun, 06/11/2023 - 21:16

కార్పొరేట్‌ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్‌ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది.

కార్పొరేట్‌ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్‌లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ  డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే..

ట్విటర్‌లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను  ట్విటర్‌లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు.

దానికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ  ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు.

దీంతో డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)