Breaking News

కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!

Published on Fri, 04/18/2025 - 19:32

టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'కోపైలట్' (Copilot) తీసుకొచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలను అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తోంది. మొత్తం మీద ప్రశ్న మీది.. సమాధానం నాది అన్నట్టుగా ఈ కోపైలట్ యూజర్లకు ఉపయోగపడుతోంది.

ప్రతి ప్రశ్నకు సమాధానం అందించే.. కోపైలట్ ఈ వేసవిలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

➢బడికి సెలవులు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులకు ఓ టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే.. పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. వారిని అదుపులో పెట్టడం కొంత కష్టమైన పనే. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే.. వారు బుద్ధిమంతుల్లా చెప్పినమాట వింటారు. మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రత్యమ్నాయం ఉండాలి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన, సులభమైన బొమ్మలు తయారు చేయడానికి, మంచి స్టోరీస్ కోసం 'కోపైలట్'ను ఉపయోగించుకోవచ్చు.

➢పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతే.. వారి షెడ్యూల్ అక్కడ వేరుగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలో వారికి పాలుపోదు. తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంత సేపు ఆదుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టు ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు.

➢వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి.. పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. వచ్చే విద్యాసంవత్సరానికి వెళ్లే విద్యార్థులను కూడా ఎలా సిద్ధం చేయాలనే బేసిక్స్ కూడా ముందుగానే కోపైలట్ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వొచ్చు.

ఇదీ చదవండి: వాట్సప్‌ స్టేటస్‌కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?

➢సమ్మర్ అంటేనే.. చాలామంది అకేషన్స్ లేదా వెకేషన్లకు వెళ్లిపోతుంటారు. దాదాపు చాలామంది లాంగ్ ట్రిప్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా పిల్లలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడంలో, ప్యాకింగ్ చెక్‌లిస్ట్‌లు, విహారయాత్రకు ప్లాన్ చేయడానికి కోపైలట్ ఓ సలహాదారుడిగా ఉపయోగపడుతుంది. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానాలు ఉంటాయి.

కోపైలట్ అనేది టెక్నాలజీలో ఒక అద్భుతం. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అది ఇచ్చే సూచనలలో ఉపయోగకరమైన ఎంచుకోవాలి. ఇది మొత్తం యూజర్ మీదనే ఆధారపడి ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)