Breaking News

వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత?

Published on Sun, 06/22/2025 - 06:02

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమైతే మనదేశ వాణిజ్యంపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ కీలక సమావేశం నిర్వహించింది. షిప్పింగ్‌ సంస్థలు, ఎగుమతిదారులు, కంటెయినర్‌ కంపెనీలు, ఇతర శాఖలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ దీనికి నేతృత్వం వహించారు.

 హర్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతానికి తటస్థ పరిస్థితులే నెలకొన్నట్టు, ఓడల రవాణాలకు ఎలాంటి ఆటంకాల్లేనట్టు ప్రతినిధులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్యంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రత్నామ్నాయాలను గుర్తించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. యుద్ధం తీవ్రతరమైతే అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. హర్ముజ్‌ జలసంధి, రెడ్‌సీ ద్వారా ఓడల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

 ఈ పరిణామాలతో సముద్ర, వాయు రవాణా చార్జీలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. హర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. కేవలం 21 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలో 20 శాతం మేర ముడి చమురు రవాణా అవుతోంది. అంతేకాదు మన చమురు దిగుమతుల్లో మూడింట రెండొంతులు, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగం మేర హర్ముజ్‌ జలసంధి ద్వారానే వస్తున్నాయి. వీటికి ఆటంకాలు ఏర్పడితే చమురు ధరలు, రవాణా, బీమా చార్జీల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావం మన దేశ వాణిజ్యంపై గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే వాణిజ్య శాఖ ఈ సమావేశం నిర్వహించింది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)