Breaking News

ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు

Published on Mon, 10/06/2025 - 21:18

చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్‌స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.

పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.

ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్‌స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?

ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్‌స్కీ చెప్పారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)