Breaking News

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ

Published on Sun, 05/04/2025 - 12:02

ఒకసారి ఛార్జ్‌ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్‌ న్యూక్లియర్‌ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్‌ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్‌ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. డైమండ్ సెమీకండక్టర్ల ద్వారా ఈ చర్యలో విడుదలైన శక్తిని విద్యుత్తుగా మారుస్తున్నట్లు పేర్కొంది.

బీవీ 100 న్యూక్లియర్ బ్యాటరీ ఫీచర్లు

పరిమాణం: ఒక చిన్న నాణెం (15x15x5 మిమీ) పరిమాణంలో ఉంటుంది.

పవర్ అవుట్ పుట్: 3 వోల్ట్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీ 100 మైక్రోవాట్ల పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటినికి 1 వాట్ పవర్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీలను తయారు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

జీవితకాలం: ఈ న్యూక్లియర్‌ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే మళ్లీ ఛార్జ్‌, మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేస్తుంది.

సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే 10 రెట్లు అధికం సామర్థ్యంతో పని చేస్తాయి.

ఇదీ చదవండి: పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?

సేఫ్టీ: విపరీతమైన ఉష్ణోగ్రతల్లో (-60°C నుంచి +120°C)  మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల మంటలు లేదా పేలుడు ప్రమాదాలను జరగవని కంపెనీ తెలుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ బ్యాటరీలు వినియోగంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఉపయోగాలు: వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఏఐ వ్యవస్థలు, డ్రోన్లు.. వంటి నిరంతరం విద్యుత్‌ అవసరమయ్యే పరికరాలకు ఈ బ్యాటరీలో ఎంతో అనువైనవిగా సంస్థ చెబుతుంది.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)