Breaking News

జస్ట్‌ మిస్‌.. బ్యాంక్‌ డబ్బులు మొత్తం ఖాళీ అ‍య్యేవి!

Published on Fri, 02/28/2025 - 16:52

అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్‌లోని డబ్బులు మొత్తం ఖాళీ అ‍య్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్‌ గత ఏప్రిల్‌ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.

ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్‌ తెలియజేసింది.

"ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్‌పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి  నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్‌ ప్రతినిధి తెలిపారు.

ఇలాంటివి 10 పొరపాట్లు
సిటీ బ్యాంక్‌లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్‌టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)