Breaking News

ఐరాస సంస్థ ‘సైట్స్‌’ మెచ్చిన వంతారా

Published on Wed, 11/26/2025 - 20:39

జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.

ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.

వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.

ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)