Breaking News

సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..

Published on Wed, 08/13/2025 - 09:06

భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సమగ్ర భూ సంస్కరణలను చేపట్టాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కీలక సూచనలు చేసింది. సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు, దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్య ఒకే స్టాంప్‌ డ్యూటీని అమలు చేసేందుందుకు వీలుగా జీఎస్‌టీ మాదిరి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది.

రక్షణాత్మక ధోరణి, వాణిజ్య యుద్ధాలు సవాలును విసురుతున్నాయంటూ.. భారత్‌లో స్థిరమైన విధానాలు, బలమైన పారిశ్రామిక సామర్థ్యాలు, దేశీయంగా అతిపెద్ద వినియోగ మార్కెట్, యువ శ్రామిక శక్తి, విశ్వసనీయ భాగస్వామిగా చాలా దేశాల్లో ఉన్న గుర్తింపు.. ఇవన్నీ భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చగలవని సీఐఐ తెలిపింది. ప్రతీ రాష్ట్రంలోనూ సమగ్ర భూ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, భూ వినియోగ మార్పిడిని పూర్తిగా డిజిటలైజ్‌ చేయడంతోపాటు స్టాంప్‌ డ్యూటీని 3–5 శాతం మధ్య స్థిరీకరణ చేయాలని సూచించింది. స్పష్టమైన భూ యాజమాన్యం దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ చర్యల ద్వారా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు చేరువ కావొచ్చని 
అభిప్రాయపడింది.

సమ్మిళిత వృద్ధి..

  • భారత్‌లో తయారీకి ఊతమివ్వడమే కాకుండా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచే దిశగా బలమైన భూ సంస్కరణలు అమలు చేయాలని సీఐఐ కోరింది. గ్రామీణాభివృద్ధి సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించొచ్చంటూ కీలక సూచనలు చేసింది.  

  • భూ చట్టాల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉంది. కనుక కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారానికి వీలుగా జీఎస్‌టీ కౌన్సిల్‌ మాదిరి ఏర్పాటు చేయాలి. సమన్వయం, ఏకాభిప్రాయం ఆధారంగా ఈ సంస్థ సంస్కరణలు చేపట్టాలి.

  • ఇండియా ఇండ్రస్టియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ (ఐఐఎల్‌బీ) ఏర్పాటు ప్రశంసనీయమేనంటూ, ఇందులో ఉన్న సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం ఇది కేవలం సమాచార సాధనంగానే పనిచేస్తోంది. రాష్ట్రాల మధ్య భూముల కేటాయింపు అధికారాలు సైతం ఉండాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి, భూముల సమీకరణ సులభతరం అవుతుంది.

ఇదీ చదవండి: టారిఫ్‌ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!

  • రాష్ట్రాల స్థాయిల్లోనూ ఒకటికి మించిన అధికార యంత్రాంగాలు ఉండడాన్ని అవరోధంగా పేర్కొంది. దీన్ని అధిగమించేందుకు ఇంటెగ్రేటెడ్‌ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. భూములు కేటాయింపు, మార్పిడి, వివాదాల పరిష్కార అధికారాలు దీనికి ఉండాలి.

  • భూ మార్పిడి విధానం డిజిటైజేషన్‌ చేయాలి. డిజిటల్‌ సంతకం పెట్టిన సర్టిఫికెట్లు, క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మూడో పక్షం ధ్రువీకరణతో పారదర్శకత తీసుకురావచ్చు. అవినీతిని తొలగించొచ్చు.

  • దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టాంప్‌ డ్యూటీలు వేర్వేరుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్యలో ఏకే విధమైన రేటును అమలు చేయాలి.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)