Breaking News

పర్యావరణహితంగా  సిమెంట్‌ పరిశ్రమ.. 

Published on Fri, 05/16/2025 - 04:33

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్‌ ఎండీ, గ్రీన్‌ సిమెంటెక్‌ 2025 చైర్మన్‌ అజయ్‌ కపూర్‌ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 

బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.  సిమెంట్‌ తయారీ సంస్థల అసోసియేషన్‌తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 21వ ఎడిషన్‌ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్‌తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. 

గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్‌ సిమెంట్స్‌ జాయింట్‌ ఎండీ ఎస్‌. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ జాతీయ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)