Breaking News

విదేశీ ప్రయాణానికి సిబిల్ స్కోరు అడ్డొస్తుందా?

Published on Sun, 07/12/2026 - 12:59

విదేశాలకు వెళ్లాలనేది చాలా మంది కల. అయితే వీసా ప్రక్రియ అనగానే డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు, ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల చుట్టూ ఎన్నో అనుమానాలు, భయాలు రేకెత్తుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఒక కొత్త సందేహం మొదలైంది. ‘నా సిబిల్ స్కోరు తక్కువగా ఉంది. దీనివల్ల నా వీసా రిజెక్ట్ అవుతుందా?’ అనే అనుమానం చాలా మందిలో ఉంది. నిపుణులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.

ఇమిగ్రేషన్ అధికారులకు ‘సిబిల్’తో పని ఉందా?

మనం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు కావాలన్నా సిబిల్ స్కోరు కీలకం. కానీ, విదేశీ రాయబార కార్యాలయాలు (ఎంబసీ) లేదా ఇమిగ్రేషన్ అధికారులు మీ వీసా దరఖాస్తును పరిశీలించేటప్పుడు మీ సిబిల్ రిపోర్టును లాగిన్ చేసి చూడరని గమనించాలి. భారతదేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ వీసా మంజూరు ప్రక్రియలో సిబిల్ స్కోరును ఒక ప్రామాణిక అర్హతగా ఎక్కడా చేర్చలేదు. అమెరికా, యూకే, కెనడా లేదా యూరప్ దేశాల వీసా నిబంధనల్లో సిబిల్ స్కోరు కనీసం ఇంత ఉండాలనే రూల్ ఎక్కడా లేదు.

వీసా ఆఫీసర్లు అసలు ఏం చూస్తారు?

విదేశీ రాయబార కార్యాలయాలు మీ క్రెడిట్ స్కోరును కాకుండా, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, స్వదేశంతో ఉన్న అనుబంధాన్ని నిశితంగా పరిశీలిస్తాయి. వారి ప్రధాన ఉద్దేశాలు ఇవే..

  • మీరు వెళ్తున్న దేశంలో ఖర్చులను మీరే భరించగలరా? (దీని కోసం గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐటీఆర్ కాపీలు, శాలరీ స్లిప్స్ చూస్తారు).

  • మీ పర్యటన ముగిసిన తర్వాత తిరిగి మీ సొంత దేశానికి వచ్చేస్తారా లేదా అక్కడే ఉండిపోతారా? (దీని కోసం మీ ఉద్యోగ వివరాలు, వ్యాపారాలు, లేదా ఇక్కడున్న ఆస్తుల పత్రాలను తనిఖీ చేస్తారు).

  • జాతీయ భద్రత, పౌరసత్వం లేదా అత్యంత సున్నితమైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగే కొన్ని అరుదైన సందర్భాల్లో మినహా సాధారణ ట్రావెల్, స్టూడెంట్ లేదా బిజినెస్ వీసాల కోసం క్రెడిట్ స్కోరును స్క్రూటినీ చేయరు.

క్రెడిట్ స్కోరు ఎప్పుడు ప్రభావం చూపుతుంది?

డైరెక్ట్‌గా సిబిల్ స్కోరు అవసరం లేకపోయినా పరోక్షంగా కొన్ని సందర్భాల్లో ఇది మీకు అవసరపడవచ్చు.

  • మీరు విదేశాల్లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా అప్లై చేస్తుండవచ్చు. దానికి ఫండ్స్ చూపించడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తే బ్యాంకులు మీ సిబిల్ స్కోరు ఆధారంగానే లోన్ ఇస్తాయి. లోన్ శాంక్షన్ అయితేనే వీసాకు అవసరమైన ఫండ్స్ ప్రూఫ్ దొరుకుతుంది.

  • మంచి క్రెడిట్ స్కోరు (750 కంటే ఎక్కువ) ఉన్నవారి బ్యాంక్ స్టేట్‌మెంట్లు సాధారణంగా క్లీన్‌గా ఉంటాయి. అనవసరపు బకాయిలు, బౌన్స్ అయిన ఈఎంఐలు లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ హెల్తీగా కనిపిస్తుంది. వీసా అధికారులు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి, క్లీన్ ఫైనాన్షియల్ హిస్టరీ మీకు ప్లస్ అవుతుంది.

వీసా దరఖాస్తుదారులు చేయాల్సింది ఇదే..

  • అప్పటికప్పుడు బంధువుల దగ్గరో, స్నేహితుల దగ్గరో పెద్ద మొత్తంలో డబ్బులు అకౌంట్‌లో వేయిస్తే వీసా అధికారులు అనుమానిస్తారు.

  • మీ ఉద్యోగ నియామక పత్రం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, గత 2-3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసుకోండి.

  • ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా మీ ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించండి.

  • మీ సిబిల్ స్కోరు 600 ఉన్నా, 800 ఉన్నా వీసా ఆఫీసర్‌కు అనవసరం. వారికి కావలసిందల్లా మీ దగ్గర ప్రయాణానికి తగినన్ని డబ్బులు ఉన్నాయా, మీరు చట్టబద్ధంగా ప్రయాణిస్తున్నారా, మీ పర్యటన ముగిశాక క్షేమంగా దేశం తిరిగి వస్తారా లేదా అనేది మాత్రమే. కాబట్టి అనవసరపు భయాలు వీడి, డాక్యుమెంటేషన్‌ను పక్కాగా సిద్ధం చేసుకోండి.

ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)