Breaking News

ధూళి రాకుండా ‘గాలి మేడ’

Published on Sat, 07/05/2025 - 20:49

మనలో చాలామంది తమ ఊహలకు రూపం వచ్చేలా కల్పించుకొని చాలాసార్లు చేతులతో ‘గాల్లో మేడలు’  కడుతుంటారు. నిజంగా అలా గాల్లో మేడలు వెలిస్తే అదో అద్భుతం. అంతలా కాకపోయినా చైనా నేరుగా గాలితోనే మేడ కట్టింది. అవును.. చైనాలోని జినాన్‌ అనే ‍ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో ధూళి, నిర్మాణ సమయంలో వెలువడే శబ్దాలను కట్టడి చేసేందుకు 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గాలితో బుడగలాంటి డోమ్‌ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అధికారిక ఫేస్‌బుక్‌ పోస్ట్ ద్వారా దీనికి సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అందులోని వివరాల ప్రకారం.. 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల గాలితో కూడిన డోమ్‌ నిర్మాణాన్ని చైనా ఆవిష్కరించింది. జినాన్‌లోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డోమ్‌ శబ్ద కాలుష్యం, ధూళి నుంచి చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షిస్తుంది. ప్రధాన కట్టడం పూర్తయ్యాక దాన్ని తొలగిస్తారు. సోషల్ మీడియాలో దీని వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో నెటిజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు దీన్నో ‘చైనీస్ టెక్నోలాజియా’ అని అన్నారు.

ఇదీ చదవండి: టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..

‘చైనా ఇలాంటి నిర్మాణాలతో ప్రతిసారీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ఈ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందులో పనిచేసే వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం కింద కార్మికుల దుస్థితిని ఊహించండంటూ తెలుపుతున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న కార్మికులను ఊపిరాడకుండా చేస్తుందని మరొకరు రాశారు. ఇది భూకంపం లేదా సునామీ కంటే ప్రాణాంతకం కావచ్చని మరొకరు రిప్లై ఇచ్చారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)