జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..

Published on Tue, 09/16/2025 - 20:28

చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ కంట్రీస్‌ యాన్యువల్ ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.

2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.

జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.

ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

జర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్‌.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)