Breaking News

చైనాలో మన ఐటీకి నో ఎంట్రీ?

Published on Mon, 10/12/2026 - 12:38

చైనా మార్కెట్‌లో భారతీయ సేవల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న వ్యాపార ప్రతిబంధకాలు, ఆంక్షలపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు, డేటా లోకలైజేషన్, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో జరుగుతున్న ఆలస్యంపై పరిశ్రమ ప్రతినిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను స్వీకరిస్తోంది.

చైనా ఏటా సుమారు 300 బిలియన్ డాలర్ల సేవల దిగుమతులు చేసుకుంటుండగా అందులో భారత వాటా కేవలం 8.95 బిలియన్‌ డాలర్లు (2024 గణాంకాల ప్రకారం) మాత్రమే ఉండటం గమనార్హం. ఐటీ, ఐటీఈఎస్, డిజిటల్ పరిష్కారాల రంగాల్లో భారత్‌కు మంచి పట్టు ఉన్నప్పటికీ చైనాలో విధిస్తున్న స్థానిక ఆంక్షల వల్ల భారతీయ కంపెనీలు ప్రత్యక్షంగా సేవలు అందించలేకపోతున్నాయి. చాలా కంపెనీలు థర్డ్-పార్టీ ఏజెన్సీల ద్వారా మాత్రమే సేవలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

కేంద్రం సమీక్షిస్తున్న ప్రధాన అంశాలు

  • చైనా డేటా లోకలైజేషన్, క్రాస్-బోర్డర్ డేటా ట్రాన్స్‌ఫర్ నిబంధనలతో పాటు భారత్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ), చైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా (పీఐపీఎల్‌) మధ్య ఉన్న సరిపోలికలను విశ్లేషిస్తున్నారు.

  • పరస్పర గుర్తింపు ఒప్పందాలు, సర్టిఫికేషన్ ప్రమాణాలలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం.

  • వీసాలు, వర్క్ పర్మిట్లు, టాలెంట్ డిప్లాయ్‌మెంట్ వ్యాపార పరమైన ప్రతిబంధకాలకంటే రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • రెమిటెన్సులు, ట్యాక్సేషన్, అంతర్జాతీయ కాంట్రాక్టుల లభ్యతలో ఎదురవుతున్న సవాళ్లపై స్పష్టత కోరారు.

ప్రపంచ వాణిజ్యంలో భారత వాణిజ్య సర్వీసుల ఎగుమతుల వాటా 2014లోని 3% నుంచి 2024 నాటికి 4.3%కి పెరిగింది. కొవిడ్ తదనంతరం భారత సర్వీసెస్ ఎగుమతుల వార్షిక వృద్ధి రేటు 14%కి చేరింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ వాణిజ్య ప్రతిబంధకాలను తొలగిస్తే డిజిటల్, స్పేస్ సర్వీసెస్ రంగాలలో భారతీయ కంపెనీలకు చైనాలో భారీ అవకాశాలు లభించే ఆస్కారముంది.

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)