Breaking News

చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!

Published on Sun, 09/08/2024 - 18:52

చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.

చైనాకు చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న  పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.

సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఆరోగ్య రంగంలోనూ..
మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో  అప్లికేషన్‌లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌డాంగ్, హైనాన్‌ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్‌లలో అనుమతించనున్నారు.

దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)