Breaking News

చైనా దూకుడు.. ఏలియన్ల కోసమే!

Published on Sat, 10/16/2021 - 08:49

అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్​ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్​ టూరిజంలో  ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసమే అంతరిక్ష ప్రయోగాలు చేపడుతుండడం గమనార్హం.
 

ఈ క్రమంలో మరో అరుదైన ఘట్టానికి చైనా వేదికైంది. ముగ్గురు వ్యోమగాములతో చైనా రాకెట్​ నింగికెగసింది. అయితే ఇది ఇతర గ్రహా ప్రయోగం కాదు. చైనా భారీ ఖర్చుతో నిర్మించిన సొంత స్పేస్​ స్టేషన్​ కోసం. భారతకాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్​ లాంచ్ సెంటర్​ నుంచి లాంగ్​ మార్చ్​ 2 ఎఫ్​ రాకెట్​ లాంఛ్​ అయ్యింది. మొత్తం ముగ్గురు (షెంజావు 13 స్పేస్​షిప్​) వ్యోమగాములు ఆరు నెలలపాటు చైనా నిర్మించిన టియాన్​గాంగ్​ స్పేస్​ స్టేషన్​లో గడపనున్నారు.



ఇప్పటిదాకా చైనా చేపట్టిన సుదీర్గ అంతరిక్ష ప్రయోగం ఇదే. టియాన్​గాంగ్​ స్పేస్​ స్టేషన్​లో ఎక్విప్​మెంట్​ను సెటప్​ చేయడంతో పాటు టెక్నాలజీని పరీక్షించడానికి వీళ్లు బయలుదేరారు. తద్వారా ఏలియన్ల కోసం పరిశోధనను ముమ్మరం చేయనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్​ వాక్​ చేసిన జాయ్​ ఇఝ్​గ్యాంగ్​​ తాజా మిషన్​కు నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాకి ఇది రెండో అధికారిక స్పేస్​ యాత్ర. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం చైనా అతిపెద్ద సిగ్నల్​ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: నటుడి అరుదైన రికార్డు

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)