Breaking News

అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లు

Published on Mon, 06/09/2025 - 15:01

అధిక ధరలు మార్కెట్ అస్థిరతకు కారణం అవుతుండడంతో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. దాంతో చైనా ఈవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీవైడీ ధరల తగ్గింపు నిర్ణయాలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది మార్కెట్‌ స్థిరత్వం, పోటీతత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఇదిలాఉండగా, చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి స్థానిక కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించాలని, తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని కోరింది.

ధరల యుద్ధానికి మూలం

ఈ పరిణామాలకు కారణం డిమాండ్‌ కంటే అధిక సరఫరా ఉండడమేనని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా తయారీదారులు మార్కెట్‌లోని డిమాండ్‌ కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో కంపెనీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దాంతో చేసేదేమిలేక ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రధాన బ్రాండ్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, చిన్న కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీవైడీ మే చివరి నుంచి ఇప్పటివరకు 21.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది.

ప్రభుత్వ జోక్యం

మితిమీరిన రాయితీల వల్ల ‘మేడ్-ఇన్-చైనా’ ఎలక్ట్రిక్ వాహనాల దీర్ఘకాలిక ప్రతిష్ఠ మసకబారుతుందని అధికారులు భయపడుతున్నారు. భారీగా ధరల తగ్గింపు వల్ల చైనా బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, విలువను ప్రశ్నించేలా చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం వాహన తయారీదారులకు ధరల క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చింది. పరిశ్రమను దెబ్బతీసే పద్ధతులను నివారించాలని కోరింది. తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని వేడుకుంది.

ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్‌ బంగారు బాతు

ఎగుమతులపై ప్రభావం

దేశీయ సవాళ్లకు అతీతంగా చైనీస్ ఈవీ తయారీదారులు గ్లోబల్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నారు. అయితే స్వదేశంలో అస్తవ్యస్తమైన సప్లై-చెయిన్‌ వల్ల ఏర్పడిన ధరల యుద్ధం విదేశాల్లో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ పట్టును కోరుకునే కంపెనీలు పోటీ ధరలతో స్థిరమైన లాభదాయకతను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)