Breaking News

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం

Published on Thu, 01/23/2025 - 21:20

ఓపెన్‌ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్‌లో ఫిర్యాదులను నమోదు చేశారు.

అంతరాయాలు కేవలం చాట్‌జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్‌ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్‌లు డౌన్‌టైమ్‌ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ‘ఎక్స్‌’, ఇన్స్‌టాగ్రామ్‌లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్‌ చేశారు.

ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్‌జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫామ్‌ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్‌మన్‌ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)