Breaking News

జపాన్‌ ల్యాండర్‌ శకలాలు గుర్తించిన చంద్రయాన్‌-2..?

Published on Sat, 06/21/2025 - 10:22

చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్‌కు చెందిన హకుటో-ఆర్‌2 లూనార్‌ ల్యాండర్‌ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.

చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్‌ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్‌ ల్యాండ్‌ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్‌ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.

భారత్‌ 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2  చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్‌సీ ద్వారా జపాన్‌ లూనార్‌ ల్యాండర్‌ ​కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్‌ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.

ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్‌ ఓపెన్‌

ఎవరీ సుబ్రమణియన్?

షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్‌-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్‌లో అంతరాయం ఏర్పడి క్రాష్‌ ల్యాండ్‌ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్‌ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్‌-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్‌ ల్యాండర్‌ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)